ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి

by Sujitha Rachapalli |

ఆస్ట్రేలియన్ నటుడు జూలియన్ మెక్‌మహాన్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడిన ఆయన.. 56ఏళ్ల వయసులో ఫ్లోరిడాలోని క్లియర్‌వాటర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య కెల్లీ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘నా భర్త జూలియన్ మెక్‌మహాన్

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియన్ నటుడు జూలియన్ మెక్‌మహాన్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడిన ఆయన.. 56ఏళ్ల వయసులో ఫ్లోరిడాలోని క్లియర్‌వాటర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య కెల్లీ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘నా భర్త జూలియన్ మెక్‌మహాన్ క్యాన్సర్‌ను అధిగమించేందుకు ధైర్యంగా పోరాడిన తర్వాత శాంతియుతంగా మరణించారు. జూలియన్ తన కుటుంబాన్ని, స్నేహితులను, తన పనిని, అభిమానులను ప్రేమించాడు. ఎంతోమంది జీవితాల్లో సంతోషాన్ని తీసుకురావడమే అతని కోరిక. ఈ సమయంలో మా కుటుంబానికి ప్రైవసీ అందించాలి’ అని కోరింది.

కాగా జూలియన్ మెక్‌మహాన్ నిప్/టక్, ఛార్మ్డ్, FBI: మోస్ట్ వాంటెడ్, ఫంటాస్టిక్ ఫోర్ వంటి చిత్రాల్లో తన నటనకు విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. మాజీ ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి విలియం (బిల్లీ) మెక్‌మహాన్, సామాజికవేత్త లేడీ సోనియా మెక్‌మహాన్ దంపతుల కుమారుడైన జూలియన్.. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ది పవర్, ది పాషన్, హోమ్ అండ్ అవే వంటి ఆస్ట్రేలియన్ సోప్ ఒపెరాలలో నటించాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు. చివరగా నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ ‘ది రెసిడెన్స్’‌లో ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రిగా నటించాడు. కాగా మెక్‌మహాన్ మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ గాయని డానీ మినోగ్, నటి బ్రూక్ బర్న్స్, కెల్లీ పనియాగువాతో జీవితాన్ని పంచుకున్నాడు.

Next Story