- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JSK: సైలెంట్‌గా ఓటీటీలోకి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మూవీ ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’.

దిశ, సినిమా: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మూవీ ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో లైంగిక వేధింపులకు గురైన యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించింది. ఇక రిలీజ్‌కు ముందు ఈ సినిమా ఎన్నో అడ్డంకులను, వివాదాలను ఎదుర్కొంది. అనుపమ పోషించిన బాధితురాలి పాత్రకు ‘జానకి’ అనే పేరు పెట్టడంపై విమర్శలు రావడంతో సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ జారీ చేయలేదు. ఇలా ఎన్నో వాయిదాల తర్వాత జులై 17న థియేటర్స్‌లో రిలీజైంది. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకోగా.. ఈ రోజు (22-08-2025) నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది.






