- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు థాంక్స్ చెప్పిన Jr.NTR.. స్పెషల్ ట్వీట్
హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) కాంబినేషన్‌లో రాబోతున్న వార్-2 సినిమా ఆగష్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) కాంబినేషన్‌లో రాబోతున్న వార్-2 సినిమా ఆగష్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదల రోజు నుండి 23/08/2025 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు మంజూరు చేశారు. టికెట్ల రేట్ల పెంపు జీవోపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan), సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్వీట్ వైరల్‌గా మారింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తారక్, హృతిక్ రోషన్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్‌తో పాటు మొత్తం సినీ అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.






