హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

by Gantepaka Srikanth |

హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులను రక్షించుకోవడంలో భాగంగా పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈకామర్స్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది. కాగా, టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా హైకోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా పేరు, ఫొటో, వీడియోలు ఉపయోగించడం, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే జూ.ఎన్టీఆర్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు లేదా ఫొటోని ఉపయోగిస్తే తప్పవని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

Next Story