- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జపాన్‌లో ఎన్టీఆర్ మ్యానియా.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న వీడియో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) గతేడాది ‘దేవర’(Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) గతేడాది ‘దేవర’(Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం వహించగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో తెలుగు తెరపై అడుగు పెట్టింది జాన్వీ. అంతే కాకుండా.. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్-2 కూడా ఉందని చిత్ర బృందం ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రజెంట్ పార్ట్-2పై ఫోకస్ పెట్టిన మేకర్స్ ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan) నటిస్తున్న ‘వార్-2’(War-2) సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే దేవర పార్ట్-2 షూటింగ్‌లో పాల్గొననున్నాడట.
ఇదిలా ఉంటే.. ‘దేవర’ మూవీ త్వరలో జపాన్(Japan)లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజై సందడి చేసిన ఈ మూవీ.. మార్చి 28న జపాన్‌లో రిలీజ్ కానుంది. దీంతో ప్రజెంట్ అక్కడ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ‘దేవర’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR)జపాన్‌లో సందడి చేశారు. అక్కడ అభిమానుల కలిసి ముచ్చటించారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






