- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15 కేజీలు తగ్గిన జూనియర్ ఎన్టీఆర్ !
డ్రాగన్ లోని లూగర్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కేజీలు తగ్గారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు నీల్.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నారు. RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ స్థాయి హీరో అయిపోయారు. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే డ్రాగన్. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న అర్ధరాత్రి డ్రాగన్ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
డ్రాగన్ లోని లూగర్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కేజీలు తగ్గారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ బరువు తగ్గడం చూసి, ఆయన ఫ్యామిలీతో పాటు తాము కూడా షాక్ అయినట్లు పేర్కొన్నారు. తాను వద్దని చెప్పినా కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా కసితో చేసి చూపించారని వ్యాఖ్యానించారు. ఒక పాత్ర కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడని పొగిడారు. వర్క్ పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్ ఏ హీరో దగ్గర లేదని తెలిపారు. ఇప్పటి వరకు తాను రాసిన పాత్రలలో లూగర్ అత్యంత డార్క్ క్యారెక్టర్ అంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టారు.






