Jr NTR: ప్రణతితో క్యూట్ ఫోటో.. ఒక్క పోస్టుతో సోషల్ మీడియాను షేక్ చేసిన యంగ్ టైగర్

by Vennela |   (  Updated:2025-03-26 05:55:19  IST  )

Jr NTR: పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో జపాన్ ట్రిప్ లో ఉన్నారు.

Jr NTR: ప్రణతితో క్యూట్ ఫోటో.. ఒక్క పోస్టుతో సోషల్ మీడియాను షేక్ చేసిన యంగ్ టైగర్
X

దిశ, వెబ్ డెస్క్: Jr NTR: పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో జపాన్ ట్రిప్ లో ఉన్నారు. జపాన్ లో దేవర ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీ జపాన్ వెర్షన్ మార్చి 28న విడుదల కానుంది. ఈ క్రమంలో తారక్ అక్కడ గత మూడు రోజులుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రిప్ లోనే ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు మంగళవారం జరిగింది. ఈ పుట్టినరోజును యంగ్ టైగర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఓ క్యూట్ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్ లో మెరిసిపోయారు. ఈ పోస్టుకు అమ్ములు హ్యాపీ బర్త్ డే అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన భార్య ప్రణతికి నందమూరి ఫ్యాన్స్ బర్త్ డే విషేస్ చెబుతున్నారు.

Read More..

మంచు ఫ్యామిలీ వివాదం.. ఈ సారి అక్కడ చూసుకుందాం అంటూ అన్నకు మనోజ్ వార్నింగ్!


Next Story