- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైవిధ్యభరితమైన కథతో ‘జిన్’
కథలో స్టఫ్ ఉండాలే గానీ, కొత్త నటీనటులైనా సరే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. సరిగ్గా అదే ఫార్ములాను తీసుకొని ఓ డిఫరెంట్ జానర్‌లో ‘జిన్’ అనే ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్. డైరెక్టర్ చిన్మయ్ రామ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని అన్ని

దిశ, సినిమా : కథలో స్టఫ్ ఉండాలే గానీ, కొత్త నటీనటులైనా సరే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. సరిగ్గా అదే ఫార్ములాను తీసుకొని ఓ డిఫరెంట్ జానర్‌లో ‘జిన్’ అనే ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్. డైరెక్టర్ చిన్మయ్ రామ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తుండగా.. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. మంచి హైప్ రావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు జిన్ అనే టైటిల్ ప్లస్ పాయింట్. కథే కాదు టైటిల్‌లో కూడా వైవిద్యం ఉండటంతో ఈ సినిమా సులువుగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా కథకు యాప్ట్ అయ్యే పలు లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఖర్చుకు నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదని.. స్ట్రాంగ్ కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుందని.. మూవీ సూపర్ సక్సెస్ కావడం పక్కా అని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.






