- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలో 'జిగ్రీస్' సునామీ.. అన్-లిమిటెడ్ నవ్వుల జాతర!
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మరియు సన్ నెక్స్ట్ (SunNXT)లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సినిమా ‘జిగ్రీస్’. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు.

దిశ, సినిమా : అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మరియు సన్ నెక్స్ట్ (SunNXT)లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సినిమా ‘జిగ్రీస్’. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ మరియు రామ్ నితిన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. కృష్ణ వోడపల్లి నిర్మాణంలో, చిత్తం వినయ్ కుమార్ సహ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా గారి సపోర్ట్ పెద్ద బలాన్ని ఇచ్చింది. సయ్యద్ కమ్రాన్ సంగీతం, ఈశ్వరదిత్య డీవోపీ మరియు చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.






