రౌడీ జనార్ధన్ ఐటమ్ సాంగ్‌లో జిగేల్ రాణి

by Pulgam srinivas |   (  Updated:2026-04-05 17:06:24  IST  )

రౌడీ జనార్ధన చిత్రంలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు తెలిసింది.

రౌడీ జనార్ధన్ ఐటమ్ సాంగ్‌లో జిగేల్ రాణి
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు మరియు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొంతకాలం క్రితం ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శర వేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త వైరల్ అవుతుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 'రౌడీ జనార్ధన'లో ఒక ఐటమ్ సాంగ్ ఉండనుందని, ఈ పాటను పూజా హెగ్డే తో ప్లాన్ చేస్తున్నట్లు, ఆమెతో మేకర్స్ ఇప్పటికే సంప్రదించినట్లు, పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే ‘రంగస్థలం’లోని జిగేలు రాణి ఐటమ్ సాంగ్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించగా, ఆ తర్వాత ఎఫ్2 మరియు కూలీ చిత్రాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ ప్రేక్షకులకు అలరించింది. ఈ నేపథ్యంలో 'రౌడీ జనార్ధన'లో పూజ్జా హెగ్డే ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు రావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.

Read more.. రష్మిక బర్త్‌డే సందర్భంగా ‘మైసా’ కొత్త పోస్టర్ విడుదల.. అంచనాలు మరింత పెంపు

Next Story