రష్మిక బర్త్‌డే సందర్భంగా ‘మైసా’ కొత్త పోస్టర్ విడుదల.. అంచనాలు మరింత పెంపు

by Pulgam srinivas |

'మైసా' కొత్త పోస్టర్‌లో రష్మిక ముఖం నిండా మట్టి, అలాగే రక్తపు మరకలతో కనిపిస్తూ రా అండ్ రస్టిక్ లుక్‌లో ఆకట్టుకుంది.

రష్మిక బర్త్‌డే సందర్భంగా ‘మైసా’ కొత్త పోస్టర్ విడుదల.. అంచనాలు మరింత పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ నటి రష్మిక మందన్న ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతోంది. అయితే ఆమె నటిస్తున్న సినిమాల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరచుకున్న చిత్రం ‘మైసా’. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పెద్దగా ప్రచార చిత్రాలను విడుదల చేయలేదు. అయినప్పటికీ ఇప్పటికే విడుదలైన పోస్టర్ల ద్వారానే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రష్మిక పాత్రకు సంబంధించిన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈరోజు రష్మిక పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టర్‌లో రష్మిక ముఖం నిండా మట్టి, అలాగే రక్తపు మరకలతో కనిపిస్తూ రా అండ్ రస్టిక్ లుక్‌లో దర్శనమిచ్చింది.

ఆమె లుక్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో రష్మిక గోండు తెగకు చెందిన యోధురాలిగా, అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అజయ్ సయ్యపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తుండటంతో ‘మైసా’ సినిమా విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.




Next Story