- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైనల్ షెడ్యూల్‌లో ‘జెట్లీ’
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దిశ, సినిమా : టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోందని.. తాజాగా ఫైనల్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభిమైందని తెలిపారు మేకర్స్. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. ‘మత్తు వలదరా’ వెనుక ఉన్న మెయిన్ టీం ఈ సినిమాకు పని చేస్తుండగా.. మ్యూజిక్ కాల భైరవ, సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ తో కలిసి రితేష్ రానా మరోసారి యూనిక్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు. రితేష్ రానా స్టైల్, సిగ్నేచర్ హ్యూమర్‌తో పాటు హై-ఎనర్జీ యాక్షన్ మేళవించిన ‘జెట్లీ’ ఫన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.






