విశ్వదాభిరామ.. నేనెవన్నిరా మామ.. సత్య ‘జెట్లీ’ టీజర్‌తో నవ్వులే నవ్వులు

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-03 17:24:01  IST  )

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించారు.

విశ్వదాభిరామ.. నేనెవన్నిరా మామ.. సత్య ‘జెట్లీ’ టీజర్‌తో నవ్వులే నవ్వులు
X

దిశ, సినిమా : టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సినిమా గ్లింప్స్‌ లాంచ్ చేశారు మేకర్స్. సత్య వాయిస్‌లో వేమన శతకంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అకస్మాత్తుగా అల్లకల్లోలం.. ప్రయాణికులు భయాందోళనకు గురికావడం.. తుపాకీ కాల్పులు.. హైజాక్ గురించి సూచిస్తూ.. సత్య పరిచయం కావడం ఆకట్టుకుంది. సత్య పాత్రను పూర్తిగా హ్యూమర్ టచ్‌తో డిజైన్ చేశారు. మేకోవర్‌తో అతని స్క్రీన్ ప్రెజెన్స్ మరింత హైలైట్ అవుతూ.. సత్య ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్ అదిరిపోయింది. సత్య–వెన్నెల కిషోర్ మధ్య వచ్చే డైలాగ్స్ గ్లింప్స్‌కు మరింత చార్మ్‌ని యాడ్ చేశాయి. నువ్వు ఏ టైర్ హీరో అని అడిగినప్పుడు..‘జనరల్ కంపార్ట్‌మెంట్’ అంటూ సత్య ఆన్సర్ ఇవ్వడం ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యింది.

Next Story