- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aghathiyaa Trailer: ఏంజెల్స్ కథలో అంతుచిక్కని రహస్యం.. విశేషంగా ఆకట్టుకుంటోన్న ‘అగత్యా’ ట్రైలర్
జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో.. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘అగత్యా’.

దిశ, సినిమా: జీవా (Jeeva), అర్జున్ సర్జా (Arjun) ప్రధాన పాత్రల్లో.. రాశీ ఖన్నా (Rashi Khanna) హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘అగత్యా’ (Aghathiyaa). ఏంజెల్స్ Vs డెవిల్ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి పీఎ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్, వామిడ్ బ్యానర్స్‌పై డాక్లర్ ఇస్తారి, అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. జనవరి 31న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇప్పుడు ఫిబ్రవరి 28న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్ (Trailer)ను రిలీజ్ చేశారు.
ఫాంటసీ హారర్ థ్రిల్లర్ (horror thriller)గా రూపొందిన ఈ మూవీ విభిన్నమైన కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ‘సుమారు 120 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆత్మలను మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు’ అనే గంభీరమైన వాయిస్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఇక ఈ కథలో ప్రధానమైన పోరాటం ఏంజెల్స్, ఆత్మల మధ్య జరిగేలా కనిపిస్తుండగా.. ఈ సినిమా ప్రేక్షకులను మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రజెంట్ ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విశేసంగా ఆకట్టుకుంటోంది.






