- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్ తో వస్తోన్న జేడీ..
జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో హర్రర్ మిస్టరీ చిత్రం… రేపు అధికారిక టైటిల్ ప్రకటన.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆయన, అనంతరం పలు సినిమాల్లో విలన్ పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల కొంతకాలం విరామం తీసుకున్న జెడి చక్రవర్తి, ఇప్పుడు డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ నటుడు “ప్రొడక్షన్ నెం.4” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. “Inspired by True Events” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం3 మీడియా మరియు మహా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సూర్యాస్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీని మిర్లాన్ నసీర్ నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను వంశీ చేపట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను రేపు ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.






