JD Chakravarthy: చిరంజీవి పెంపకం అలా ఉంటుంది.. ఆ రోజు చరణ్ ప్రవర్తనతో అది స్పష్టమైంది

by Pulgam srinivas |

జేడీ మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే మధ్యలో రాకూడదనే సంస్కారం రామ్ చరణ్ లో ఉండటం చూసి తాను షాక్ అయ్యానని జేడీ చక్రవర్తి తెలిపారు.

JD Chakravarthy: చిరంజీవి పెంపకం అలా ఉంటుంది.. ఆ రోజు చరణ్ ప్రవర్తనతో అది స్పష్టమైంది
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయిన జేడీ చక్రవర్తి తాజాగా చిరంజీవి గురించి, ఆయన పెంపకం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జేడీ మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిలో చిరంజీవి గారి పెంపకం అద్భుతమని చెప్పారు. దీనికి ఉదాహరణగా ఒక సంఘటనను కూడా వివరించారు. చాలా సంవత్సరాల క్రితం తాను చిరంజీవి గారిని తరచూ కలుస్తూ ఉండేవాడినని, ఆ సమయంలో వారి ఇల్లు దగ్గరలోనే తన ఇల్లు ఉండేదని చెప్పారు. అందుకే అప్పుడప్పుడు ఆయన ఇంటికి వెళ్లి సరదాగా మాట్లాడి వచ్చేవాడినని పేర్కొన్నారు.

ఒకరోజు చిరంజీవి గారి ఇంట్లో హాల్లో కూర్చొని మాట్లాడుతున్న సమయంలో, రామ్ చరణ్ హాల్ పక్కన ఉన్న రూమ్ దగ్గరకు వచ్చి వారిని చూసి మళ్లీ వెళ్లిపోయాడని తెలిపారు. ఇక దాదాపు 45 నిమిషాల తర్వాత మళ్లీ వచ్చి గోడ దగ్గర నిలబడి వారిని చూస్తూ ఉన్నాడని చెప్పారు. అది గమనించిన చిరంజీవి గారు, “చక్రవర్తి గారు, మీరు ఏమీ అనుకోకండి… చరణ్ బయటకు వెళ్లాలని అప్పటినుంచి చూస్తున్నాడు. కానీ మీరు మాట్లాడుతున్నారని మధ్యలో రావడం ఇష్టపడట్లేదు” అని చెప్పారట. ఈ విషయం విన్న జేడీకి ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. చిన్న వయసులోనే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో అంతరాయం కలిగించకూడదనే సంస్కారం రామ్ చరణ్‌లో ఉండటం చూసి, చిరంజీవి గారు అతనిని ఎంత గొప్పగా పెంచారో అర్థమైందని జేడీ చక్రవర్తి తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Next Story