- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kalidas: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడి తనయుడు.. పోస్ట్ వైరల్
మలయాళ నటుడు జయరామ్(Jayaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ నటుడు జయరామ్(Jayaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత హ్యాపీ సర్దార్(Happy Sardar), విక్రమ్(Vikram), పూమరమ్(Poomaram), రాయన్(Rāyan) వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈయన సినిమాల్లో తండ్రి పాత్రల్లో నటించి.. అందరి ఫేవరెట్ నటుడిగా మారిపోయాడు. గుంటూరు కారం(Guntur KARAM), హాయ్ నాన్న(HI NANNA), అల వైకుంఠపురం(Ala Vaikuntapuram)లో వంటి పలు మూవీల్లో నటించారు. తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
అయితే తాజాగా జయరామ్ కుమారుడు కాళిదాస్(Kalidas) వివాహం జరిగింది. మోడల్ తరిణి(Model tharini) అనే అమ్మాయిని కేరళ(Kerala)లోని గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్(Guruvayur Sri Krishna Temple)లో ఇవాళ (డిసెంబరు 08) ఇరు కుటుంబీకుల మధ్య వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేశ్ గోపి(Union Minister of State for Tourism Suresh Gopi) దంపతులు కూడా హాజరై.. కొత్త జంటను ఆశీర్వదించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు కాళిదాసు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా మోడల్ తరిణికి అండ్ కాళిదాస్ ప్రజలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్‌లో కాళిదాసు టెంపుల్‌లో వివాహం జరగడం హ్యాపీగా ఉందని వెల్లడించాడు. ప్రస్తుతం వీరి పెళ్లి పిక్స్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.






