- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెండితెరకు పరిచయం కానున్న జయప్రద కుమారుడు
జయప్రద తన కుమారుడు ‘సామ్రాట్’ను వెండితెరకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు దాదాపు పూర్తయినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో అనేక సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన వారిలో జయప్రద ఒకరు . ఈమె ఇప్పటికీ కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటూ తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే, ఈ నటి తన కుమారుడు సామ్రాట్ను వెండితెరకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈయన వెండితెరకు పరిచయం కావడం ఖాయం అయినట్లు సమాచారం.
ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే, జయప్రద కూడా తన కుమారుడి తొలి చిత్రానికి సంబంధించిన అనేక బాధ్యతలను స్వయంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో మంచి క్రేజ్ ఉన్న ఓ హీరోయిన్‌ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక సామ్రాట్ విషయానికి వస్తే, సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం నటన, డాన్సులు, ఫైట్లలో ప్రత్యేక శిక్షణ తీసుకొని పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి జయప్రద తన కెరీర్‌లో సాధించిన విజయాల మాదిరిగానే, ఆమె కుమారుడు సామ్రాట్ కూడా వెండితెరపై సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.






