ఆ ఒక్క పని చేసుంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది.. జయంత్ సి. పరాన్జీ

by Pulgam srinivas |

జయంత్ సి. పరాన్జీ మాట్లాడుతూ... తీన్‌మార్ మూవీని 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్ గా రూపొందించాం. ఆ కథలో మార్పులు చేసి ఉంటే మంచి విజయం సాధించి ఉండేది అని ఆయన అన్నారు.

ఆ ఒక్క పని చేసుంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది.. జయంత్ సి. పరాన్జీ
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో జయంత్ సి. పరాన్జీ ఒకరు. ఈయన తన కెరీర్లో ఎన్నో రీమేక్ మరియు కొత్త కథలతో రూపొందిన సినిమాలకు దర్శకత్వం వహించి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఒకానొక సమయంలో ఈయన రీమేక్ సినిమాలకు దర్శకత్వం వహించనని కూడా చెప్పాడు. కానీ ఆ తర్వాత ఓ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించి చేదు అనుభవాన్ని మిగిల్చుకున్నాడు.

పవన్ కళ్యాణ్ హీరోగా త్రిష, కృతి కర్బంద హీరోయిన్లుగా రూపొందిన తీన్‌మార్ మూవీని హిందీ ఫిలిం అయిన లవ్ ఆజ్ కల్ చిత్రానికి రీమేక్గా రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా తీన్‌మార్ సినిమా లవ్ ఆజ్ కల్ అనే హిందీ సినిమాకు రీమేక్గా రూపొందించాం.

అలా రెడీ అయిన తర్వాత దానిని తెలుగు నేటివిటీకి తగ్గట్లు అనేక మార్పులు, చేర్పులు చేయాల్సింది, కానీ అలా మేమేమీ చేయకుండా రూపొందించాం. ఆ సినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. అదే నేను లవ్ ఆజ్ కల్ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న తర్వాత అందుకు తగినట్లు మార్పులు, చేర్పులు చేసుకున్నట్లయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేదేమో అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో పవన్ రెండు పాత్రల్లో నటించాడు. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.

Next Story