- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబాయ్ లో దుకాణం ఓపెన్ చేసిన జయం రవి..స్టేడియంలోనే ప్రియురాలితో...!
హీరో జయం రవి తన ప్రియురాలు సింగర్ కెనిషాతో దుబాయ్ స్టేడియంలో మెరిశారు

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టగా.. పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ గురించి అందరూ చర్చించుకుంటున్న నేపథ్యంలో.. ఓ తమిళ హీరో తన ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయాడు.
హీరో జయం రవి తన ప్రియురాలు సింగర్ కెనిషాతో దుబాయ్ స్టేడియంలో మెరిశారు. గత కొన్ని రోజులుగా... భార్య ఆర్థికి దూరంగా ఉంటున్న జయం రవి... సింగర్ కెనిషాతో రిలేషన్ పెట్టుకున్నట్లు ఇప్పటికీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. తన ప్రియురాలు కెనిషా తో కలిసి... ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా చూశాడు జయం రవి. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్... రకరకాలుగా స్పందిస్తున్నారు. దుబాయిలో వీళ్ళ ప్రేమాయణం... పీక్ స్టేజ్ కి వెళ్లిందని అంటున్నారు.






