- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జయం రవి-ఆర్తి విడాకుల వివాదం.. ఎట్టకేలకు స్పందించిన కెనీషా ఫ్రాన్సిస్
కెనీషా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ... చెన్నై పట్టణాన్ని, అలాగే నాకు ఎంతో ఇష్టమైన సంగీతాన్ని వదిలి వెళ్లిపోతున్నానని చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు జయం రవి, అతని భార్య ఆర్తి వైవాహిక బంధం ముగింపునకు రావడానికి తానే ప్రధాన కారణమంటూ వస్తున్న ఆరోపణలపై పాప్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. చిన్న వయసులో మా తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత బంధువుల దగ్గర పెరిగాను. వారి దగ్గర కూడా అనేక బాధలను ఎదుర్కొని తట్టుకున్నాను. ఇక నాకు 18 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. నాకు మంచి భర్త దొరకలేదు. పెళ్లయిన కొన్నాళ్లకే నేను కడుపుతో ఉన్న సమయంలో నా భర్త తన స్నేహితుల ముందు నన్ను కొట్టాడు. దాంతో నా గర్భం కూడా పోయింది. చాలా చిన్న వయసులో తల్లిదండ్రులను, కడుపులో ఉన్న బిడ్డను కోల్పోయాను.
నాకు నిజమైన బాధ ఏంటో చాలా తెలుసు. రవి - ఆర్తి దంపతులు విడిపోవడానికి నేనే కారణమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కొంతమంది చంపుతామని కూడా బెదిరిస్తున్నారు. రవి చిన్న పిల్లవాడు కాదు. ఎవరితో ఎలా ఉండాలో తనకు బాగా తెలుసు. ఎవరు ఇంకొకరు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మరు. నాకు ఆయన కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే. నేను ఎవరిని విడగొట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నాపై అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దాంతో నేను చెన్నై పట్టణాన్ని, అలాగే నాకు ఎంతో ఇష్టమైన సంగీతాన్ని వదిలి వెళ్లిపోతున్నాను. ఇక రవిని మీరే చూసుకోండి అంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.






