- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి వారి వల్ల నిర్మాతలకు డబ్బు వృథా కాదు.. ఆ స్టార్స్‌పై మాళవిక ప్రశంసలు
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ బ్యూటీగా దూసుకుపోతున్న మాళవిక మోహనన్..

దిశ, సినిమా: ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ బ్యూటీగా దూసుకుపోతున్న మాళవిక మోహనన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ దళపతిపై ప్రశంసలు కురిపించింది. వీరిద్దరు కలిసి నటించిన ‘మాస్టర్’ సినిమా షూటంగ్ మేమోరీస్ పంచుకుంటూ.. ‘మాస్టర్ సినిమా ఫస్ట్ డే షూటింగ్‌లోనే చాలా కష్టమైన సీన్ చేయాల్సి వచ్చి నా ఫోకస్ మొత్తం డైలాగ్స్ పైనే పెట్టాను. కానీ విజయ్ మాత్రం ఎలాంటి కష్టమైన్ సీన్‌లో నటించాల్సి వచ్చినా చాలా కూల్‌గా ప్రతి విషయంపై ఫోకస్ చేస్తారు. చాలా సరదాగా ఉంటారు. అంతేకాదు.. ఎప్పుడు ఏ అవసరం వచ్చిన ఫోన్ చేయగలిగే స్వేచ్ఛను ఇచ్చారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ అలా అందుబాటులో ఉండటం చాలా గొప్ప విషయం’ అని చెప్పుకొచ్చింది.
అలాగే తను నటించిన స్టార్స్ గురించి మాట్లాడుతూ.. ‘మోహన్ లాల్, రజనీకాంత్, విజయ్ వంటి సీనియర్ స్టార్ నటుల సినిమాల్లో నటించడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఉదయం 7 గంటలకు షూటింగ్ అంటే వాళ్లు 6:55 సెట్స్‌లో ఉంటారు. అలాంటి వారి వల్ల నిర్మాతలకు డబ్బు వృథా కాదు’ అని తెలిపింది.
- Tags
- Malavika Mohanan






