- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో మరో విడాకులు.. ఐదు నిమిషాల క్రితమే కన్ఫర్మ్ అయిందని నటి పోస్ట్..
జై భనుశాలి, మహి విజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యాంకర్‌గా రాణించిన జై ప్రస్తుతం నటుడిగా మారగా.. మహి పలు సీరియల్స్, సిరీస్‌లు, షోలతో తన సత్తా చాటింది. దాదాపు 14 ఏళ్లు హ్యాపీగా ఉన్న ఇద్దరు.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : జై భనుశాలి, మహి విజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యాంకర్‌గా రాణించిన జై ప్రస్తుతం నటుడిగా మారగా.. మహి పలు సీరియల్స్, సిరీస్‌లు, షోలతో తన సత్తా చాటింది. దాదాపు 14 ఏళ్లు హ్యాపీగా ఉన్న ఇద్దరు.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఎన్నో ఆనందకర క్షణాలను ఆస్వాదించారు. కానీ ఇవన్నీ కూడా ట్రస్ట్ ఇష్యూస్ కారణంగా బ్రేక్ అయిపోయాయి. చివరగా కూతురి బర్త్ డే ఫంక్షన్‌లో కలిసి కనిపించిన ఈ స్టార్ కపుల్.. ఇప్పటికే వేరు వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లల కస్టడీ గురించి కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా దీనిపై విజ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఐదు నిమిషాల క్రితమే అఫిషియల్‌గా డివోర్స్ కన్ఫర్మ్ అయింది. ఈ సందర్భంగా చాలా మంది కంగ్రాట్స్ చెప్పొచ్చు. సెలబ్రేట్ చేసుకునే సమయం అనొచ్చు. కానీ నా వరకు విడాకులు చాలా విషాదకరం.పెళ్లి, జీవిత కాల బంధం అనే పదాలకు అర్థం లేకుండా చేస్తుంది’ అని అభిప్రాయపడింది.






