- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్ చరణ్‌ను కలిసిన జపాన్ ఫ్యాన్స్.. స్పెషల్ గిఫ్ట్స్‌తో సందడి!
by Jakkula.Mamatha |
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

X
దిశ,వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ‘RRR’ తో అది దేశాలు దాటింది. ఈ క్రమంలో నటుడు రామ్ చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయనను చూడడం కోసం కొందరు ఫ్యాన్స్ జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ వెంటనే వారిని ఇంటికి పిలిచి మాట్లాడారు.
వారితో కొంత సమయం సరదాగా గడిపారు. అందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఆ అభిమానులంతా ‘పెద్ది’ సినిమా స్పెషల్ టీషర్ట్స్ వేసుకుని సందడి చేశారు. స్టిల్స్ ను గ్రీటింగ్ కార్డ్స్ గా కట్ చేస్తూ రామ్ చరణ్ కు చూపించారు. దీంతో వాళ్ళ ప్రేమకు చరణ్ ఆశ్చర్యపోయారు. అలాగే క్రికెట్ బ్యాట్స్ పైన సిగ్నేచర్ చేసి రామ్ చరణ్ వారికి అందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.వీడియో
Next Story






