జపాన్ ఫిల్మ్ ప్రతినిధుల బృందంతో డిప్యూటీ సీఎం భేటీ

by Sujitha Rachapalli |

హైదరాబాద్‌ను చలనచిత్ర కార్యకలాపాలకు ప్రపంచ కేంద్రంగా మార్చాలనే గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి దార్శనికత మరియు సంకల్పం అందరికీ తెలిసిందే. CODA (కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ - టోక్యో, జపాన్) నుండి జపాన్ ఫిల్మ్ & అనిమే పరిశ్రమ

జపాన్ ఫిల్మ్ ప్రతినిధుల బృందంతో డిప్యూటీ సీఎం భేటీ
X

దిశ, సినిమా : హైదరాబాద్‌ను చలనచిత్ర కార్యకలాపాలకు ప్రపంచ కేంద్రంగా మార్చాలనే గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి దార్శనికత మరియు సంకల్పం అందరికీ తెలిసిందే. CODA (కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ - టోక్యో, జపాన్) నుండి జపాన్ ఫిల్మ్ & అనిమే పరిశ్రమ ప్రతినిధి బృందంతో సంభాషించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను, దానిని సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను తెలిపారు. డిజిటల్ పైరసీని ఎదుర్కోవడానికి చిత్ర పరిశ్రమకు పూర్తి మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు.

CODA తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన సందర్భంగా జపాన్ ప్రతినిధి బృందాన్ని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధిలను గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. చిత్ర పరిశ్రమ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, గౌరవ ఉప ముఖ్యమంత్రులకు వారు ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. జపాన్ ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపింది. ముందుగా వారు ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి CODA ప్రయాణం, భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా జపనీస్ కంటెంట్‌కు పెరుగుతున్న ప్రజాదరణ గురించి వివరించారు. జపాన్‌లో తెలుగు చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ గురించి కూడా తెలిపారు.

తరువాత జపాన్‌లోని టోక్యోలోని కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ (CODA) ప్రతినిధి డైరెక్టర్ శ్రీ టకేరో గోటో, అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ సీనియర్ డైరెక్టర్ శ్రీ తత్సుయ ఓట్సుకా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సందర్శించి ఈ MOUపై సంతకం చేశారు. డిజిటల్ పైరసీకి వ్యతిరేకంగా బెస్ట్ ప్రాక్టీసెస్, వ్యూహాలు, ఉమ్మడి ప్రచారాలపై నాలెడ్జ్ పంచుకోవడానికి ఈ MOU రూపొందించబడింది. ఆ తర్వాత CODA బృందం TFCC యొక్క యాంటీ వీడియో పైరసీ సెల్ (AVPC) ఉపయోగించే పద్ధతులు, సాఫ్ట్‌వేర్ సాధనాలను పరిశీలించింది మరియు పైరసీని ఎదుర్కోవడంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విధానాన్ని ప్రశంసించింది.

Next Story