'పుష్ప-3'లో జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్!

by D.Reddy |   ( Updated:2025-01-24 03:11:37.0  )
పుష్ప-3లో జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్!
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సిరీస్‌ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా వీటిల్లో 'ఊ ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ', 'కిస్సిక్' ఐటెమ్‌ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్రాల సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.. పుష్ప మూడో పార్ట్‌లో ఐటెమ్‌ సాంగ్‌పై ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్‌కు నటి జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) డ్యాన్స్‌ వేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే పుష్ప 2లోని 'కిస్సిక్‌' పాటకు యంగ్ బ్యూటీ శ్రీలీల అయితే బాగుంటుందని తానే సూచించినట్లు తెలిపారు. శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్‌ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌కు చెప్పానని అన్నారు. పాట ఆధారంగా దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

ఇక, 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్ సూపర్‌హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత దానికి సిక్వెల్‌గా గతేడాది డిసెంబరు 5న విడుదలైన పుష్ప:ది రూల్ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్‌లలో సందడి చేస్తోంది. వసూళ్ల విషయంలో ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్‌ చేసింది. 32 రోజుల్లోనే రూ.1831 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. అలాగే, ఈనెల 17 నుంచి ఈ సినిమాలో అదనపు సన్నివేశాలను (20 నిమిషాల నిడివి) జోడించారు.

Advertisement

Next Story

Most Viewed