- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ ఒంటరైన జానులిరి, ప్రియుడితో బ్రేకప్.. సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు?
ఫోక్ డ్యాన్సర్, ఢీ షో విన్నర్ జాను లిరి మరోసారి ఒంటరైనట్టు కనిపిస్తోంది. గతంలో టోని అనే ఫోక్ డ్యాన్సర్ ను పెళ్లి చేసుకున్న జాను కొన్నేళ్ల క్రితం విడిపోయింది. ఆ తరవాత దిలీప్ అనే సింగర్ తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఫోక్ డ్యాన్సర్, ఢీ షో విన్నర్ జాను లిరి మరోసారి ఒంటరైనట్టు కనిపిస్తోంది. గతంలో టోని అనే ఫోక్ డ్యాన్సర్ ను పెళ్లి చేసుకున్న జాను కొన్నేళ్ల క్రితం విడిపోయింది. ఆ తరవాత దిలీప్ అనే సింగర్ తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అతడితోనూ బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. జాను తన ఇన్ స్టాలో బ్రేకప్ పోస్టులు పెడుతుండగా, దిలీప్ సైతం బ్రేకప్ పోస్టులు పెట్టడంతో వీరిద్దరూ విడిపోయారంటూ నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.
ఇక జాను చేసిన ఓ పోస్టులో ఒక పర్సన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామంటే అక్కడ నుండి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తేనే కొనసాగించు లేదంటే వేస్ట్.. అంటూ పేర్కొంది. తప్పు లేకపోయినా కొన్నిసార్లు మాటలు పడాల్సి వస్తుందని, మన దారిన మనం పోయిన బురద చల్లుతారని..మరక చేయడానికే వచ్చినవాళ్ల గురించి ఆలోచించడం ఎందుకు అంటూ మరో పోస్టులో పేర్కొంది. అంతే కాకుండా బీ స్ట్రాంగ్ అంటూ ఆమెను కొందరు ఓదారుస్తున్న వీడియోలను సైతం జాను షేర్ చేసింది.
ఇక దిలీప్ సైతం ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేయగా తరవాత దానిని డిలీట్ చేశాడు. దీంతో ఇద్దరికీ బ్రేకప్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రెండు రోజుల క్రితమే దిలీప్ జానుకు సంబంధించిన ఫోక్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు ఇప్పటి వరకు జాను కానీ దిలీప్ కానీ బ్రేకప్ పై అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉంటే టోనీతో విడిపోయిన తరవాత జాను మళ్లీ పెళ్లి చేసుకునేది లేదని చెప్పగా దిలీప్ తో పెళ్లి అని వార్తలు రాగా సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. ఆ తరవాత అందరూ లైట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ బ్రేకప్ అంటూ వార్తలు రావడంతో ఇద్దరూ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.






