జాన్వీ చూపంతా సౌత్‌పైనే.. బాలీవుడ్‌ను పక్కన పెట్టిందా?

by Pulgam srinivas |   (  Updated:2026-05-25 05:59:50  IST  )

జాన్వీ కపూర్ తాజాగా ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కనున్న ఓ కోలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

జాన్వీ చూపంతా సౌత్‌పైనే.. బాలీవుడ్‌ను పక్కన పెట్టిందా?
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీ సినిమాల ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన జాన్వీ అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించింది. అందులో భాగంగా ‘దేవర పార్ట్ 1’ చిత్రంతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఆమెకు సౌత్‌లో కూడా మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈమె ‘పెద్ది’ అనే మరో తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా మరికొంత కాలంలో విడుదల కానుంది. ఇక తాజాగా ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కనున్న ఓ కోలీవుడ్ చిత్రానికి కూడా జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్తతో బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలపైనే జాన్వీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక జాన్వీ నటించిన ‘పెద్ది’ సినిమా మంచి విజయం సాధిస్తే ఆమెకు సౌత్ ఇండస్ట్రీ నుంచి మరిన్ని భారీ అవకాశాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగులో తొలి ట్రావెల్ ఓటీటీ.. శ్రీ సత్య చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయిన ‘విహారి’

Next Story