తెలుగులో తొలి ట్రావెల్ ఓటీటీ.. శ్రీ సత్య చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయిన ‘విహారి’

by Pulgam srinivas |   (  Updated:2026-05-25 05:29:59  IST  )

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ‘బిగ్ బాస్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సత్య చేతుల మీదుగా ‘విహారి ఓటీటీ’ గ్లోబల్ విజన్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.

తెలుగులో తొలి ట్రావెల్ ఓటీటీ.. శ్రీ సత్య చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయిన ‘విహారి’
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ సినీ రంగంలో ఎంతో గుర్తింపు పొందిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ‘బిగ్ బాస్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సత్య చేతుల మీదుగా ‘విహారి ఓటీటీ’ గ్లోబల్ విజన్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో తెలుగు డిజిటల్ వినోద రంగంలో ట్రావెల్ కథనాలకు కొత్త దిశ ప్రారంభమైనట్లు చెప్పొచ్చు. దాదాపు 18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ‘విహారి’, ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ ఓటీటీ వేదికగా మారేందుకు సిద్ధమవుతోంది.

తెలుగు మీడియాలో ట్రావెల్ షోల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, విశేషాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన ప్రయాణ కథనాలను అందించిన ‘విహారి’, ఇకపై ఓటీటీ రూపంలో మరింత విస్తృత స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రయాణ కథనాలకే అంకితమైన తెలుగు తొలి ఓటీటీ వేదికగా ‘విహారి ఓటీటీ’ జూన్ నెలలో ఘనంగా ప్రారంభం కానుంది.

Next Story