జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్ రిలీజ్.. ‘పెద్ది’ పై ఇంకా పెరిగిన అంచనాలు

by Chukka Sudharani |

పెద్ది మూవీలో రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్‌పై ఓ బ్యూటీఫుల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నా విషయం తెలిసిందే.

జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్ రిలీజ్.. ‘పెద్ది’ పై ఇంకా పెరిగిన అంచనాలు
X

దిశ, సినిమా: ‘పెద్ది’(Peddi) టీమ్ ప్రజెంట్ శ్రీలంకలో సందడి చేస్తున్నారు. అక్కడ రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్‌పై ఓ బ్యూటీఫుల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నా విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా పెద్ది నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌తో పాటు ఆమె పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘పెద్ది’లో జాన్వీ కపూర్ అచ్చియమ్మగా కనిపించబోతున్నట్లు తెలుపుతూ.. ‘ఫైర్‌బ్రాండ్ వైఖరితో మా పెద్ది నుంచి అందమైన జాన్వీకపూర్‌ని అచ్చియ్యమ్మగా పరిచయం చేస్తున్నాము’ అంటూ తెలిపారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో జాన్వీ లుక్‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

కాగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. అకాడమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27, 2026న గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

Next Story