- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘హోమ్ బౌండ్’.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘హోమ్ బౌండ్’. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ప్రశంసలు అందుకుంది. పలు అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ చేయబడింది. అలాగే ‘ఆస్కార్ 2026’ నామినేషన్స్ కోసం అఫీషియల్ ఎంట్రీ పొందింది. అలాంటి ఈ మూవీ సెప్టెంబర్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజై జస్ట్ యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. దీంతో అప్పుడే ‘హోమ్ బౌండ్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు మొహమ్మద్ షోయబ్ అలీ, చందన్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరూ పోలీస్ ఆఫీసర్స్ కావాలని కలలు కంటారు. ఇందులో జాన్వీ కపూర్ పోషించిన సుధా భారతి పాత్ర అణగారిన వర్గాలు ఎదుర్కొనే నిర్మాణాత్మక అడ్డంకులకు అద్దం పడుతుంది.
- Tags
- OTT
- Janhvi Kapoor






