- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ప్రేమ కథ.. ఆ హీరోతో జతకట్టనున్న జాన్వీ కపూర్?
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో అతిలోక సుందరి కూతురిగా ఫుల్ పాపులారిటీ దక్కించుకోవడంతో పాటు గ్లామర్ తో యూత్ ను ఫిదా చేసింది. ‘సన్నీ సంస్కారికి తులసి కుమారి’, ‘పరమ్ సుందరి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు దోచేసిన ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే ఈ బ్యూటీ మరో లవ్ స్టోరీలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్ హీరో లక్ష్య ప్రధాన పాత్రలో దర్శకుడు రాజ్ మెహతా ‘లగ్ జా గాలే’ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు సమా చారం. ప్రేమ, ప్రతీకారం లాంటి అంశాలతో యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు, ఇందులో టైగర్ ష్రాఫ్ విలన్‌గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.






