జస్ట్ ఒక్క డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న జాన్వీ కపూర్

by Pulgam srinivas |

'మానవా ఓ మానవా' డైలాగ్‌ను క్యూట్‌గా చెప్పి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జస్ట్ ఒక్క డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న జాన్వీ కపూర్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన పెద్ది సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న విజయవాడలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ తెలుగులో స్పీచ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె క్యూట్‌గా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. అయితే జాన్వీ స్పీచ్‌లో ఒక డైలాగ్ మాత్రం ప్రత్యేకంగా వైరల్ అయింది.

గతంలో చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి చెప్పిన “మానవా ఓ మానవా” డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. పెద్ది ఈవెంట్‌లో ఆ డైలాగ్‌ను స్క్రీన్‌పై ప్లే చేసి యాంకర్ సుమ, జాన్వీని చెప్పమని అడగగా, ఆమె కూడా ఎంతో క్యూట్‌గా “మానవా ఓ మానవా” అంటూ పలికింది. దీంతో ఒక్క డైలాగ్‌తోనే జాన్వీ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Next Story