శ్రీదేవి చీరలో జాన్వీ.. అంత‌లోనే అవ‌మానం, కొంగు ప‌ట్టి లాగాడు !

by velandi.Saikiran |   (  Updated:2025-09-23 08:46:33  IST  )

తన తల్లి శ్రీదేవి చీరలో జాన్వీ క‌పూర్ మెరిశారు. హోంబౌండ్‌ సినిమా స్క్రీనింగ్ కోసం... ఈ ముద్దుగుమ్మ ప్రత్యేక చీర

శ్రీదేవి చీరలో జాన్వీ.. అంత‌లోనే అవ‌మానం, కొంగు ప‌ట్టి లాగాడు !
X

దిశ‌, వెబ్ డెస్క్: బాలీవుడ్ అందాల తార జాన్వీ క‌పూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలనాటి హీరోయిన్ శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని... బాలీవుడ్ అదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు జాన్వీ. ఇప్పటికే దేవర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్... మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాకపోయినా... టాలీవుడ్ లో మాత్రం జాన్వీ క‌పూర్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో ఈ బ్యూటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాలకు సైన్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తాజాగా తన తల్లి శ్రీదేవి చీరలో జాన్వీ క‌పూర్ మెరిశారు. హోంబౌండ్‌ సినిమా స్క్రీనింగ్ కోసం... ఈ ముద్దుగుమ్మ ప్రత్యేక చీరలో వచ్చింది. తన తల్లి గతంలో ధరించిన చీరను... కట్టుకొని ఈవెంట్ కు వచ్చింది.

దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ... ఈ ఈవెంట్ లో జాన్వీ క‌పూర్ నడుచుకుంటూ వెళ్తుండగా... ఓ వ్యక్తి ఆమె కొంగుపై కాల్ వేశాడు. దీంతో జాన్వీ క‌పూర్ ఒక్క‌సారిగా స్ట్ర‌క్ అయిపోయారు. కాస్త అటు ఇటు అయినా.. జాన్వీ కింద‌పడిపోయేవారు. కానీ..కొంగుపై కాలేసిన వ్య‌క్తి... అల‌ర్ట్ అయి.. కాలు తీశాడు. దీంతో ప్ర‌మాద‌మేమి జ‌రుగ‌లేదు. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Next Story