ఎన్టీఆర్ కోసం రాత్రికి రాత్రే మూడు కోట్లు ఖర్చు చేసిన జాన్వీ కపూర్..!

by Disha Web Desk 6 |
ఎన్టీఆర్ కోసం రాత్రికి రాత్రే మూడు కోట్లు ఖర్చు చేసిన జాన్వీ కపూర్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత నటి శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ‘ధడక్’ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంది. అయితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ కుర్రాళ్లకు అందాల విందు ఇస్తోంది.

తాజాగా, ఎన్టీఆర్ కోసం జాన్వీ కపూర్ కొన్ని కోట్లు ఖర్చు చేసిందని ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్‌కు ముంబై నుంచి హైదరాబాద్ రావాలి అంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారట. ఈ ఇబ్బంది కారణంగా తాను ఎక్కడ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేయలేక పోతానేమోనని భావించి జాన్వీ ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. తన వల్ల ఎన్టీఆర్ సినిమాకు చెడ్డ పేరు రాకూడదు అన్న ఉద్దేశంతోనే ఆమె హైదరాబాద్‌లో రాత్రికి రాత్రి ఏకంగా రూ.3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారని టాక్. ఇలా హైదరాబాద్ లో తనకంటూ సొంత ఇల్లు ఉంటే చాలా ప్రశాంతంగా షూటింగ్ పనులపై కాన్సన్ట్రేషన్ చేయవచ్చు అన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Next Story