- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామాలో జాన్వీ కపూర్!
షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’ సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

దిశ, సినిమా: షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’. ఒక మనిషి, రోబోట్‌ని ప్రేమించడం అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి అమిత్ జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించగా.. 2024లో లవర్స్ డే స్పెషల్‌గా వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. మ్యాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా సీక్వెల్ ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని తెలుస్తుంది.
షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో సాగిన కథనే, ఈ తర్వాతి భాగంలో కొనసాగించాలని భావిస్తున్నారట. Maddock Films సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ప్రధాన తారాగణం మళ్లీ ఇందులో నటించే అవకాశం ఉందని ప్రాథమిక సంకేతాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతుండగా.. ఈ చిత్రంలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను సైతం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మొదటి భాగం సూపర్ సక్సెస్ కాగా.. రెండొవ భాగంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట జాన్వీ. అయితే.. ఈ సీక్వెల్‌తో పాటు జాన్వీ పాత్రపై కూడా త్వరలో అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.






