ఆ స్టార్ హీరో కారణంగానే జాన్వీ కపూర్‌కు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయా..?

by Disha Web Desk 6 |
ఆ స్టార్ హీరో కారణంగానే జాన్వీ కపూర్‌కు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయా..?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ధడక్ మూవీతో 2018లో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన దేవర లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే జాన్వీ కపూర్‌‌ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తుంది.

బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రానప్పటికీ తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కానప్పటికీ జాన్వీకి ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఇటీవల ఆమెకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అలాగే మరో స్టార్ హీరో మూవీలో ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చేస్తుంది.

ఈ భామ తెలుగులో వరుస చిత్రాల్లో ఆఫర్లు అందుకోవడానికి కారణం టాలీవుడ్ హీరో అని టాక్. ఓ బడా హీరో అండ ఉండటం వల్లే ఆఫర్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా జాన్వీ అతిలోక సుందరి శ్రీదేవి లాగా స్టార్ హీరోయిన్ కావడం పక్కా అని చర్చించుకుంటున్నారు.


Next Story