Janvi Kapoor: యంగ్ హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చిన జాన్వీ కపూర్.. కారణం ఏంటంటే? (పోస్ట్)

by Hamsa |
Janvi Kapoor: యంగ్ హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చిన జాన్వీ కపూర్.. కారణం ఏంటంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక గత ఏడాది జాన్వీ కపూర్, ఎన్టీఆర్(NTR) ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్‌ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం జాన్వీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన ‘rc-16’లో నటిస్తుంది. అలాగే హిందీలో ‘పరం సుందరి’ (Param Sundari)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రొమాంటిక్ కామెడీ సినిమాగా రాబోతుండగా.. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) హీరోగా నటిస్తున్నారు.

ఓ వైపు స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు పెడుతూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్‌(Khushi Kapoor)పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఆమె నటించిన ‘లవ్‌యాపా’ ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ఖుషీకి విషెస్ చెప్తూనే జాన్వీ రిక్వెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ఎంత కష్టమైనప్పటికీ నీకు నచ్చిన దాన్ని చాలా నిజాయితీగా, శ్రద్ధగా చేస్తుంన్నందుకు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.

వినోదం, హాస్యంతో పాటు ఎమోషనల్ సన్నీవేశాలతో కూడిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం రేపటి నుంచి అన్ని థియేటర్స్‌లో సందడి చేస్తుంది. నేను ఈ సినిమా చూసి కచ్చితంగా భావోద్వేగానికి గురవుతాను. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్‌లలో నా ఖుషీ ఏడవడం బిగ్‌స్క్రీన్‌పై చూపినప్పుడు నేను తగ్గుకోలేను. ఖుషీ దయచేసి నీ సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు నా ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించాల్సిందే’’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే ‘లవ్‌యాపా’ అని ఉన్న టీషర్ట్ ధరించిన ఫొటోలను షేర్ చేసింది. కాగా, ఖుషీ కపూర్, జునైద్ ఖాన్(Junaid Khan) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ యాపా’. ఈ రొమాంటిక్ సినిమాకు చందన్ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో షాహిద్ కపూర్, రాధికా కీలక పాత్రల్లో నటించారు. దీనిని కరణ్ జోహార్(Karan Johar) నిర్మించారు.

Advertisement
Next Story