చిరంజీవి చిత్రంపై జన నాయగన్ ఎఫెక్ట్

by Pulgam srinivas |

జన నాయగన్ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆన్లైన్‌లో లీక్ కావడంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ 'మెగా 158' మూవీ లాంచింగ్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవి చిత్రంపై  జన నాయగన్ ఎఫెక్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి మూవీని బాబి కొల్లి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక లాంచింగ్ కార్యక్రమాన్ని రేపు నిర్వహించాలని మూవీ బృందం ప్లాన్ చేసుకుంది. అందులో భాగంగా దర్శకుడు బాబి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరినట్లు, అందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో రేపు గ్రాండ్‌గా 'మెగా 158' మూవీ ఓపెనింగ్ జరగబోతుందని మెగా అభిమానులు ఫిక్స్ అయ్యారు.

అయితే ఇలాంటి సమయంలోనే వారికి షాక్ తగిలింది. ఈ బ్యానర్ వారు తమిళంలో విజయ్ హీరోగా రూపొందించిన జన నాయగన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఈ సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు. ఇక నిన్న రాత్రి అకస్మాత్తుగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీంతో ఆ నిర్మాణ సంస్థ ప్రస్తుతం ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా 'మెగా 158' సినిమా లాంచ్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. కొత్త లాంచ్ తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story