- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరిహర వీరమల్లు సక్సెస్ చేయడానికి జనసేన కార్యకర్తలు కష్టపడాలి - MLC
పవన్ కళ్యాణ్ ()Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు (Hari Hara veera mallu ). ఈ సినిమా రిలీజ్ కానున్న న

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్ ()Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు (Hari Hara veera mallu ). ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో... పొలిటికల్ చర్చ మొదలైంది. వైసిపి అటు కూటమి నేతలు..... ఈ సినిమా విడుదలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ( Jana Sena MLC Jayamangala Venkataramana) కూడా స్పందించారు. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ చేయడానికి జనసేన కార్యకర్తలు అందరూ కష్టపడాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలు అందరూ సినిమా కోసం కష్టపడాలని... ఆదేశించారు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా లాభాల కోసం సినిమాలు చేయడం లేదని.. గుర్తు చేశారు. హరిహర వీరమల్లు అనేది ఒక చారిత్రాత్మక సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమాలోని సందేశాన్ని... ప్రజలకు చేరవేసేలా జనసేన కార్యకర్తలు పనిచేయాలని ఆదేశించారు.
23వ తేదీ అంటే ఇవాళ రాత్రి నుండే ప్రీమియర్ షో తో పాటు.... 24వ తేదీన టికెట్లు దొరకని వారికి మనం సౌకర్యాలు కల్పించాలని... స్పష్టం చేశారు జనసేన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ. దీంతో జయమంగళ వెంకటరమణ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అదే సమయంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా.. ఈ సినిమాపై స్పందించారు. హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అయి... కనకవర్షం కురవాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.






