- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమాతో పవన్ కల్యాణ్ రేంజ్‌లో ఏంటో దేశం మొత్తం తెలుస్తుంది: జనసేన నేత
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara VeeraMallu) సినిమా చిత్రీకరణ పూర్తయింది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara VeeraMallu) సినిమా చిత్రీకరణ పూర్తయింది. షూటింగ్ కంప్లీట్ అయిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం తెలియజేసింది. ఇక థియేటర్లలో విడుదల కావడమే తరువాయి అని నిర్మాత ఏఎమ్ రత్నం పోస్టు పెట్టారు. తాజాగా దీనిపై జనసేన నేత బొలిశెట్టి సత్యానారాయణ(Bolisetti Satyanarayana) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. తనతో హరిహర వీరమల్లు సినిమా గురించి ఒక వ్యక్తి చెప్పిన మాటలను ఎక్స్‌లో పేర్కొన్నారు.
‘దేశంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించిన ఏఎం రత్నం ఒక చక్కటి సందేశాత్మక హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నా జీవితంలో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది.. నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన చిత్రమిది. పవన్ కళ్యాణ్ మనసు పెట్టి నటించారు. ఖుషి పవన్ ప్రతిభను సత్తాను తెలుగు రాష్ట్రాల చాటింది.. హరిహర వీరమల్లు దేశానికి, ప్రపంచానికి పవన్ ఎవరో చెబుతుంది’ అని హరిహర వీరమల్లు చిత్రబృందంలోని వ్యక్తి తనతో చెప్పారని బొలిశెట్టి సత్యానారాయణ అన్నారు. దీంతో హరిహర వీరమల్లు సంచలానాత్మక విజయం సాధించాలని, మెగా సూర్యా ప్రొడక్షన్స్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నారని బొలిశెట్టి నెట్టింట్లో పేర్కొన్నారు.
దేశంలో ఎన్నో ఉత్తమ చిత్రాలని నిర్మించిన నిర్మాత, ఒక చక్కటి సందేశాత్మక హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి సామాన్యుడిలా కనబడే దేశ భక్తుడు అయిన శ్రీ ఏ ఎం రత్నం గారు హరిహర వీరమల్లు సినిమా గురించి ఒక పెద్దాయన (నా మిత్రుడి)తో చెప్పింది:
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) May 6, 2025
"ఇది నా జీవితంలో ఉత్తమ చిత్రంగా… https://t.co/QdwUURa5FG






