- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళపతి విజయ్, అభిమానుల మధ్య బంధం.. సాంగ్ అదిరింది..
దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జన నాయకుడు’. ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హెచ్.వినోద్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున జనవరి 9న రిలీజ్ కానుంది

దిశ, సినిమా : దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జన నాయకుడు’. ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హెచ్.వినోద్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున జనవరి 9న రిలీజ్ కానుంది. తాజాగా మేకకర్స్ ఈ సినిమా నుంచి ‘ఒక పేరే అలరారు..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. రాక్‌స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తోన్న ‘జన నాయకుడు’ చిత్రంలోని ఈ పాటకు తెలుగులో శ్రీనివాస మౌళి సాహిత్యం అందించగా.. శ్రీకృష్ణ, విశాల్ మిశ్రా ఆలపించారు. పాటలోని బలమైన సాహిత్యం దానికి తగ్గ బీట్ అందరినీ మెప్పిస్తోంది. తన అభిమానులతో దళపతి విజయ్‌కున్న గాఢమైన అనుబంధాన్ని ఈ పాట ద్వారా వ్యక్తం చేశారు. అన్నీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో పాట దూసుకెళ్తుండటం విశేషం. ఇక కెవిఎన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ ‘జన నాయకుడు’ కావటం ఓ ప్రత్యేకత. అలాగే విజయ్ కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఇంతకు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. అందులో ఆయన తన అభిమానులతో కలిసి ఓ సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. దీనికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.






