చిరు రికార్డును క్రాస్ చేసిన ఆ ఇద్దరిని అందుకోలేకపోయిన 'జన నాయగన్'

by Pulgam srinivas |

విజయ్ నటించిన 'జన నాయగన్' తొలి రోజే రూ.81.05 కోట్ల వసూళ్లు సాధించి, చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాన్ని వెనక్కి నెట్టింది.

చిరు రికార్డును క్రాస్ చేసిన ఆ ఇద్దరిని అందుకోలేకపోయిన జన నాయగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే ఈ ఏడాదిలో సగానికి పైగా పూర్తైంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌ను నమోదు చేశాయి. విశేషమేమిటంటే, ఈ ఏడాది అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల్లో మూడు తెలుగు సినిమాలే చోటు దక్కించుకున్నాయి. ఇంతకాలం వరకు తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చిరంజీవి హీరోగా రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు' రూ.74.25 కోట్లతో నాలుగో స్థానంలో కొనసాగింది. అయితే తాజాగా తలపతి విజయ్ నటించిన 'జన నాయగన్' తొలి రోజే రూ.81.05 కోట్ల వసూళ్లు సాధించి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

దీంతో 'మన శంకర వరప్రసాద్ గారు' ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం 'దురంధర్: ది రివేంజ్' రూ.204 కోట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, 'పెద్ది' రూ.117.20 కోట్లతో రెండో స్థానంలో, 'ది రాజా సాబ్' రూ.101.80 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. 'జన నాయగన్' సినిమాపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో ఈ చిత్రం ఈ ఏడాది సౌత్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో సూపర్ ప్లేస్ లో నిలుస్తుందని అభిమానులు భావించారు. అయితే భారీ ఓపెనింగ్స్ నమోదు చేసినప్పటికీ, ఈ సినిమా సౌత్‌లో ఈ ఏడాది అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడో స్థానానికే పరిమితమైంది.

Next Story