JANA NAYAGAN: విజయ్ చివరి సినిమాకు మైండ్ బ్లోయింగ్ డీల్.. ఏకంగా

by Naveena |

త‌మిళ సూప‌ర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ మ‌రికొన్ని రోజుల్లో సినిమాలు దూర‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే.

JANA NAYAGAN: విజయ్ చివరి సినిమాకు  మైండ్ బ్లోయింగ్ డీల్.. ఏకంగా
X

దిశ, వెబ్ డెస్క్: త‌మిళ సూప‌ర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ మ‌రికొన్ని రోజుల్లో సినిమాలు దూర‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ త‌మిళ వెట్రి క‌ళ‌గం అనే పార్టీని స్థాపించాడు. ఈ నేపథ్యంలోనే తన సినీ కెరియరో చివరి సినిమాగా వసున్న జ‌న నాయ‌గన్ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు . ఇక ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. హీరోయిన్ పూజా హెగే (Pooja Hegde) రొమాన్స్ చేయడానికి సిద్ధం అయ్యింది. అలాగే ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీగా మారిన మళయాల నటి మమిత బైజు (Mamita baiju) కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కూడా విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించ‌నుండ‌గా.. క‌న్న‌డ టాప్ బ్యాన‌ర్ కేవీఎన్ ప్రోడ‌క్ష‌న్ ఈ మూవీని నిర్మించ‌నుంది.

ఇక విజయ్ దళపతి సినీ కెరియర్ లోనే చివరి సినిమా కావడంతో అభిమానులు చాలా ఆసక్తిగా జ‌న నాయ‌గన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక భారీ బడెట్ తో రాబోతున్న ఈ సినిమా రైట్స్ కోసం భారీగా పోటీ పడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికోసం ఏకంగా రూ.121 కోట్లు చెల్లించి 'జన నాయగన్' పాన్ ఇండియా ఓటీటీ హక్కులు పొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

Next Story