పాతబస్తీ నేపథ్యంలో ‘జమాన’

by Sujitha Rachapalli |

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాకు తేజస్వి అడప నిర్మాత.

పాతబస్తీ నేపథ్యంలో ‘జమాన’
X

దిశ, సినిమా : సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాకు తేజస్వి అడప నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. యు/ఏ సట్టిఫికెట్ పొందగా.. జనవరి 30న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే ఈ చిత్రం.. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో తెరకెక్కింది. మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో కూడిన మూవీలో.. ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్‌లు ఉండబోతున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే‌తో నడిపించారు. ఎమ్. జి మూవీస్ అచ్చిబాబు ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

Next Story