- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
45 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి.. నెట్టింట వైరల్‌గా మారిన సీమంతం వీడియో

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు రెడిన్ కింగ్స్లీ(Redin Kingsley) అందరికీ సుపరిచితమే. ఆయన జైలర్(Jailer), క చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. తనదైన నటనతో ఊహించని రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్న ఆయన వ్యాపారవేత్తగా కాను రాణించారు. గత ఏడాది ఆయన కంగువ(Kanguwa), బ్లడీ బెగ్గర్(Bloody Beggar) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక రెడిన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇక 47 ఏళ్లకు ఆయన 2023లో తన ప్రేయసి సీరియల్ నటి సంగీత(Sangeetha)(45)ను పెళ్లి చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు.
ఇక అప్పటికే నుంచి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రెడిన్ భార్య సంగీతం తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ సంగీత సీమంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక సంగీత మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. 47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతుండటంతో కొందరు వావ్ గ్రేట్ అని అంటున్నారు.