జైల‌ర్ 2లో మ‌రో స్టార్ హీరో...? ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే

by velandi.Saikiran |

జైలర్ 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే

జైల‌ర్ 2లో మ‌రో స్టార్ హీరో...? ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth)... ఈ పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు మంచి పాపులారిటీ ఉంది. ఎంతో కష్టపడి పైకి వచ్చిన హీరోలలో రజినీకాంత్ ఒకరు. అయితే అలాంటి రజినీకాంత్ ( Rajinikanth) 2023లో చేసిన జైలర్ సినిమా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా పార్ట్ 2 కూడా రాబోతోంది. జైలర్ 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ , సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో ఈ మూవీ రాబోతోంది.

ఎప్పటి లాగే అనిరుధ్, ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. జైలర్ 2 సినిమాను 2026, జూన్ 12వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ వైరల్ గా మారుతోంది. మొన్నటి వరకు జైలర్ 2 సినిమాలో నందమూరి బాలయ్య స్పెషల్ లో కనిపిస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ లో విజయ్ సేతుపతి పాల్గొంటున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, అందులోని కొన్ని సీన్స్ లో విజయ్ సేతుపతి నటించారని టాక్.

అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే జైలర్ 2 సినిమాను ఇండియా వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. అందుకే ఒక్కో భాష నుంచి ఒక్కో నటుడిని, ఈ సినిమాలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే విద్యా బాలన్ కు కూడా ఛాన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఎస్ జె సూర్య కూడా ప్రత్యేక పాత్రలో కనిపించ‌బోతున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. అటు శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్ కు కూడా ఇందులో ఛాన్స్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Next Story