జైలర్ 2 రిలీజ్ డేట్‌లో మార్పు.. ఎప్పటికీ వాయిదా పడిందంటే?

by Chukka Sudharani |

రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మరోసారి వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం.

జైలర్ 2 రిలీజ్ డేట్‌లో మార్పు.. ఎప్పటికీ వాయిదా పడిందంటే?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వస్తున్న చిత్రం ‘జైలర్ 2’. సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న ‘జైలర్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎదురు చూస్తున్న కొద్ది ఈ చిత్రం వాయిదాలు పడుతూనే ఉంది. మొదట జైలర్ 2ను జూన్‌లో రిలీజ్ చేద్దాం అనుకోగా కొన్ని కారణాల చేత వాయిదా పడింది. మళ్లీ ఆగస్టు 15కు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆగస్టు 15 వీకెండ్‌లో భారీ క్లాష్ ఉండటంతో ఇప్పుడు మేకర్స్ గణేశ్ చతుర్థి హాలిడే సీజన్‌ను టార్గెట్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు జైలర్ 2 ను సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. అలాగే సరైన టాక్ వస్తే జైలర్ 2 తమిళ ఇండస్ట్రీ నుంచి తొలి ₹1000 కోట్ల చిత్రంగా నిలిచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story