- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జై హనుమాన్ అప్డేట్: ఆ ఇద్దరిపై 20 రోజుల షూటింగ్ పూర్తి
'జై హనుమాన్' యూనిట్ రిషబ్ శెట్టి, దగ్గుపాటి రానాపై 20 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'జై హనుమాన్' చిత్రం గురించి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఫస్ట్ షెడ్యూల్‌లో భాగంగా 20 రోజుల పాటు రిషబ్ శెట్టి, దగ్గుపాటి రానాపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించనుండగా, దగ్గుపాటి రానా లుక్ కూడా అదిరిపోయే స్థాయిలో ఉండనున్నట్లు సమాచారం.
'హనుమాన్' చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'హనుమాన్' బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో పాటు, ఇందులో రిషబ్ శెట్టి, దగ్గుపాటి రానా వంటి స్టార్ నటులు నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్, కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.






