- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జై హనుమాన్ షూటింగ్ అప్డేట్.. రంగంలోకి స్టార్ హీరో
తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికి తెలిసిందే.

దిశ, సినిమా: తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికి తెలిసిందే. భారీ అంచనాలు సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రాబోతున్నది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌ను ఇటీవల హంపీలో గ్రాండ్‌గా పూజాకార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన షూటింగ్ అప్డేట్ వచ్చింది. ‘కాంతార’ సక్సెస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో రిషబ్ శెట్టి.. ఇప్పుడు ‘జై హనుమాన్’ కోసం రంగంలోకి దిగారు. తాజాగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన చిత్రీకరణ స్టార్ట్ అయినట్లు తెలుస్తుండగా.. ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెట్‌లో రిషబ్‌తో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాట్లు టాక్. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి అనే అంశం చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథతో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’లో టైటిల్ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. కాగా.. టీ సిరీస్ సమర్ఫనలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.






